గుడ్‌బై చెప్పాలనుకున్నా!

రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకునే పరిణితి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశాల పట్ల తనలో ఉన్న భయాలు తొలగిపోయాయని తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉందీ సుందరి. బాలీవుడ్లో వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది. సినిమాల్లో అడుగుపెట్టడానికి ముందు నటనను గురించి తనకు తెలిసింది తక్కువేనని రాశీఖన్నా చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘తొలి సినిమా ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చేవరకు నటనకు సంబంధించి నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ సీన్స్ పూర్తికాగానే వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. ఆ సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనిపించింది. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ పరిణతి వచ్చిన తర్వాతే నటనను ఆస్వాదించడం మొదలుపెట్టా’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

