టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ ఫేం మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya)ను హీరోయిన్గా ఫైనల్ చేయబోతున్నాడంటూ వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ జనాల కోసం ఓ అప్డేట్ వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 6 నుంచి మొదలు కానుందట. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడని ఇప్పటివరకున్న టాక్. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఈ ఏడాది లింగుస్వామి డైరెక్షన్లో బై లింగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రామ్. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సారి ఏకంగా RAPO 20వ ప్రాజెక్టుగా వస్తున్న పాన్ ఇండియా సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!