Dhurandhar franchise | చరిత్ర సృష్టించిన రణవీర్ సింగ్ ‘ధురంధర్’.. రూ. 3,000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ సినిమాగా రికార్డు
Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' (Dhurandhar) ఫ్రాంచైజీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టించింది.
Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ (Dhurandhar) ఫ్రాంచైజీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టించింది. కేవలం రెండు భాగాలతోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల వసూళ్ల మార్కును దాటి, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్ ఫ్రాంచైజీగా నిలిచింది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.
ధురంధర్ పార్ట్ 1
డిసెంబర్ 5, 2025న విడుదలైన మొదటి భాగం ‘ధురంధర్’ అంచనాలను మించి దూసుకుపోయిన సంగతి తెలిసిందే. హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 840 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా భారత్ నుంచి అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచి, ఫ్రాంచైజీకి బలమైన పునాది వేసింది.
ధురంధర్ 2
మొదటి భాగం విడుదలైన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,700 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా, ఒకే భాషలో (హిందీ) రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. దీంతో ఈ రెండు చిత్రాల ఉమ్మడి వసూళ్లు ఇప్పుడు రూ. 3,000 కోట్ల మైలురాయిని చేరుకున్నాయి. అయితే ఒకే ఫ్రాంచైజీలో రూ.3000 కోట్లు రాబట్టిన మొదటి చిత్రంగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించారు. దేశభక్తి మరియు హై-వోల్టేజ్ యాక్షన్ కలయికతో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీ, గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

