టాలీవుడ్ యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) నటిస్తున్న తాజా చిత్రం రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga). అర్జున్ రెడ్డి ఫేం (తమిళ వెర్షన్) గిరీసాయ (Gireesaaya) దర్శకత్వం వహిస్తున్నాడు. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘నువ్వొచ్చి నాతో మాట్లాడేంత వరకు నేను నీతో మాట్లాడను..గుర్తు పెట్టుకో.. ‘అంటే ‘నువ్వొచ్చి నాతో మాట్లాడేంత వరకు నేనూ నీతో మాట్లాడను గుర్తు పెట్టుకో.. ‘అంటూ హీరోహీరోయిన్లు (చైల్డ్ క్యారెక్టర్స్) ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్న సీన్‌తో ట్రైలర్ మొదలైంది. తాజా ట్రైలర్ లవ్, ఎమోషన్, సీరియస్, ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతూ క్యూరియాసిటీని కలిగిస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై కేతిక శర్మ, వైష్ణవ్ తేజ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని ట్రైలర్‌తో అర్థమవుతోంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది.