Animal The Film | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం యానిమల్ (Animal) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది రణ్‌బీర్ కపూర్ టీం.
తాజాగా రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి టీం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK)షోలో సందడి చేసింది. బాలకృష్ణతో హీరోహీరోయిన్లు ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేశారు. రణ్‌బీర్ కపూర్ ఎంట్రీలోనే ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.. డైలాగ్ చెప్పగా సెట్స్ అంతా ప్రశంసలతో ముంచెత్తిందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు రణ్‌బీర్‌కపూర్ తాత రాజ్‌కపూర్, తన తండ్రి ఎన్టీఆర్ గతంలో ఎలాంటి అనుబంధం కొనసాగించేవారో కూడా చెప్పాడట బాలకృష్ణ. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడనే దానిపై ఆహా త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.
ఆహాలో స్ట్రీమింగ్ కాబోయే ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను చాలా వినోదాత్మకంగా డిజైన్ చేసినట్టు ఇప్పటివరకు నెట్టింట వైరల్ అవుతున్న స్టిల్స్ చెబుతున్నాయి. యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్ ఉండబోతుందని ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ చెబుతున్నాయి. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన నాన్న నువ్ నా ప్రాణం (NannaNuvNaaPranam) లిరికల్ సాంగ్‌తోపాటు మిగిలిన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. తండ్రీకొడుకులైన అనిల్ కపూర్-రణ్‌బీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలతోఎమోషనల్ టచ్‌తో సాగుతున్న ఈ పాట అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుందని విజువల్స్ చెబుతున్నాయి.
యానిమల్ ప్రమోషనల్ స్టిల్స్..
Guess the song which they danced for?
“W̶R̶O̶N̶G̶ WILD ANSWERS ONLY 😈”#RanbirKapoor𓃵 @iamRashmika @imvangasandeep #Animal #AnimalTheFilm #AnimalOn1stDec #UnstoppableWithNBK #NandamuriBalakrishna @ahavideoIN pic.twitter.com/48IJyhxBMR— Animal The Film (@AnimalTheFilm) November 15, 2023
#MansionHouse #ValueZone #realkhiladiofficial @MYDrPainRelief @Manepally18 @sprite_india #ambicadurbarbathi pic.twitter.com/P0rkiYcolP
— ahavideoin (@ahavideoIN) November 14, 2023
Idi sample mathrame. asalu sisalu show abhi baaki hei mere dosth!😉Get ready for wildest entertainment Feast with team #Animal📷#UnstoppableWithNBK #NandamuriBalakrishna #RanbirKapoor @iamRashmika @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/00EOVynpJL
— ahavideoin (@ahavideoIN) November 14, 2023
నాన్న నువ్ నా ప్రాణం లిరికల్ సాంగ్..
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..
Satranga is yours noww🤍https://t.co/DEvMZcMcTm#Animal2ndSong #AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23 @arijitsingh @singer_karthik @shreyaspuranik@KuttiKalam @IananthaSriram@EricnPillai #DurgeshRRajbhatt… pic.twitter.com/guheXsKtrE
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2023