బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న రణ్‌బీర్.. సంజయ్ దత్ బయోపిక్‌లో హావభావాలను అద్భుతంగా పలికించి మెప్పించాడు. ప్రస్తుతం బ్రహ్మాస్త్రా చిత్రంతో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బ్లాక్ సినిమాకు రణ్ బీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘‘రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్ ’’ పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్ గతంలో సంజయ్‌తో పని చేసిన తన అనుభవాలను పంచుకున్నాడు. డబ్బు కోసం అతడు ఎన్నడూ పనిచేయలేదు. బాబీ సినిమాలో నటించినందుకు ఒక పెయింటింగ్‌ను మాత్రమే ఇచ్చారని అన్నాడు. గతంలో బ్లాక్ సినిమా కోసం భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేటప్పుడు తాను అనేక గంటల పాటు మోకళ్లపై కూర్చునే వాడని చెప్పుకొచ్చాడు.
ఒక్కోసారి భన్సాలీ తనని తిట్టేవాడని, మరి కోపం ఎక్కువైతే కొట్టేవాడని కూడా అప్పటి విషయాలని గుర్తుచేసుకున్నాడు రణ్‌బీర్ కపూర్. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీలోనే అలాంటి ఘటనలు తనకు ఎదురుకావడం బయట ప్రపంచాన్ని ఎదర్కునేలా తనని సిద్ధం చేసిందని రణ్ బీర్ చెప్పాడు. త్వరలో ఈ కుర్ర హీరో అలియా భట్ని పెళ్లాడనున్నట్టు తెలుస్తుంది.