తరాలపాటు గుర్తుండే సినిమా ‘రామాయణ’
‘శ్రీరాముడి భావోద్వేగ ప్రయాణాన్ని తెరపై చూపించడం తేలికైన విషయంకాదు. చిన్నతనం నుంచీ ఈ కథపై ఉన్న ప్రేమ, మమకారం వల్ల భక్తిభావంతో ఈ సినిమాలో నటించాను. సీతగా సాయిపల్లవిలో దైవత్వాన్ని చూస్తారు. ఇక యశ్ తప్ప రావణ పాత్రను అంతగొప్పగా ఎవరూ చేయలేరు. కొన్ని తరాలపాటు గుర్తుండిపోయే సినిమా ఇది’ అని రణ్‌బీర్‌కపూర్ అన్నారు.
‘శ్రీరాముడి భావోద్వేగ ప్రయాణాన్ని తెరపై చూపించడం తేలికైన విషయంకాదు. చిన్నతనం నుంచీ ఈ కథపై ఉన్న ప్రేమ, మమకారం వల్ల భక్తిభావంతో ఈ సినిమాలో నటించాను. సీతగా సాయిపల్లవిలో దైవత్వాన్ని చూస్తారు. ఇక యశ్ తప్ప రావణ పాత్రను అంతగొప్పగా ఎవరూ చేయలేరు. కొన్ని తరాలపాటు గుర్తుండిపోయే సినిమా ఇది’ అని రణ్‌బీర్‌కపూర్ అన్నారు. ఆయన శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. నితీశ్ తివారీ దర్శకత్వంలో దాదాపు మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజీలోని తొలిభాగం దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘రామాయణం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో రణబీర్‌కపూర్ మాట్లాడారు.
యశ్ మాట్లాడుతూ ‘నమిత్ మల్హోత్రా లాంటి నిర్మాత వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ఈ కావ్యాన్ని నితీశ్ తివారీ జనరంజకంగా మలిచారు. సీతామాత వైబ్ తెరపై సాయిపల్లవిలో కనిపిస్తుంది. అద్భుతమైన నటుడు రణబీర్. ఈ సినిమాతో శ్రీరాముడిగా తను జనానికి గుర్తుండిపోతాడు’ అని చెప్పారు. ‘రామాయాణాన్ని పూర్తిగా అధ్యయనం చేసి దర్శకుడు నితీశ్ తివారీ ఈ సినిమా తీశారు. నమిత్ మల్హోత్రా ఖరీదైన కల ఈ సినిమా. ప్రపంచం మెచ్చేలా ఈ సినిమా నిర్మించాలనే ఇంటెన్షన్‌తో ఆయన నిర్మించిన సినిమా ఇది. ఎన్టీరామారావుగారి పౌరాణికాలు చూసి పెరిగాం. ఆ సినిమాలు ఓ త్రెడ్గా నాకు ఉపయోగపడ్డాయి. రామ, రావణులుగా రణబీర్, యశ్ విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో భాగం కావడం నా భాగ్యం. నేను చేసిన సీతమ్మ పాత్రలోని దివ్యత్వం భావితరాలకు సైతం కనిపించాలని కోరుకుంటున్నా’ అని సాయిపల్లవి పేర్కొన్నారు. ఇంకా నిర్మాత నమిత్ మల్హోత్రా, డైరెక్టర్ నితీశ్తివారీ, నటి రకుల్‌ప్రీత్‌సింగ్, నటుడు రవి దూబే తదితర చిత్రబృందంతోపాటు దిల్‌రాజు, కరణ్‌జోహార్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

