Ramayan Runtime | బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ (Ramayana). నితీష్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. హనుమన్ జయంతి కానుకగా ఇటీవల ఈ సినిమా నుంచి చిత్రబృందం రామ గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. తాజాగా ఈ సినిమా రన్‌టైంకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో హాలీవుడ్ మీడియాతో ‘రామాయణ్’ సినిమా విశేషాలను పంచుకుంటున్న సమయంలో.. రణ్‌బీర్ కపూర్ అతడికి తెలియకుండానే సినిమా రన్‌టైం గురించి నోరు జారడు.
ఈ సినిమా గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ.. దాదాపు 6 గంటల ఎపిక్ విజువల్స్‌తో ఈ సినిమా రాబోతుంది. రామాయణం అనేది ఒక మహా కావ్యం. దీనిని ఏమాత్రం కుదించకుండా, ప్రతి కీలక ఘట్టాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించేందుకే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని రణ్‌బీర్ తెలిపాడు. అయితే రణ్‌బీర్ అన్న 6 గంటల రన్‌టైం అనేది ఒక పార్ట్‌కి సంబంధించిందా లేదా రెండు పార్టులకి సంబంధించిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. నమిత్ మల్హోత్రా దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది.
Bro accidentlly revealed runtime of #Ramayana pic.twitter.com/7g7ZIN8pp3
— Tyler Burbun (@BurbunPitt) April 4, 2026