Rana Daggubati | పాన్ ఇండియా సినిమాలు నా చిన్నప్పటి నుంచీ ఉన్నాయి.. రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rana Daggubati | పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్.. నటుడు రానా దగ్గుబాటి. బాహుబలితో పాన్ ఇండియా స్టార్డమ్ చవిచూసిన ఆయన.. అసలు స్టార్డమ్ నిర్వచనమే మారిపోతున్నదని అంటున్నారు. సినిమాలో విషయం ఉండాలే కానీ, ప్రచార ఆర్భాటాలతో పనిలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Rana Daggubati | పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్.. నటుడు రానా దగ్గుబాటి. బాహుబలితో పాన్ ఇండియా స్టార్డమ్ చవిచూసిన ఆయన.. అసలు స్టార్డమ్ నిర్వచనమే మారిపోతున్నదని అంటున్నారు. సినిమాలో విషయం ఉండాలే కానీ, ప్రచార ఆర్భాటాలతో పనిలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
భారతీయ సినిమా స్వరూపం రోజురోజుకూ మారిపోతున్నది. ఒకప్పుడు తెలుగు, తమిళం సినీజనాలకు ముంబైలో ఏం జరుగుతున్నదో అంతగా తెలిసేది కాదు! అది వేరే ప్రపంచం అనుకునేవాళ్లు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎల్లలు చెరిగిపోతున్నాయి. భారతీయ సినిమా పరిపూర్ణతను సంతరించుకుంటున్నది. ఇఫ్ఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేదికగా బాలీవుడ్, టాలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ప్రస్తావిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.
ఓటీటీ కారణంగా ఇతర భాషా చిత్రాలు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాయి. ముంబైలో పలువురు ఫహాద్ ఫాజిల్ సినిమాల గురించి చర్చించడం గమనించాను. ఆ సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ కాలేదు. అక్కడి థియేటర్లలోనూ రిలీజ్ అవ్వలేదు. ఓటీటీ వల్ల చాలామంది చూడగలిగారు. అయితే, ఓటీటీకి ఎంత అలవాటుపడినా.. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై చూడాల్సినవి. థియేటర్లో అందరితో కలిసి చూస్తేనే ఆ సినిమాల్లోని భావోద్వేగాలను ఆస్వాదించగలం.

ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. అయితే, ప్రీరిలీజ్ ఈవెంట్లకు భారీగా ఖర్చు చేస్తేనే సినిమాకు ప్రచారం వస్తుంది అనుకుంటే పొరపాటే! ‘పుష్ప’, ‘కాంతార’ సినిమాలు దీన్ని రుజువు చేశాయి. ‘కాంతార’ సినిమా బడ్జెట్‌కు, అది చేసిన వసూళ్లకు సంబంధమే లేదు. అంతగా ఆదరించారు. ఆ చిత్రానికి పెద్దగా ప్రచారం చేసిందీ లేదు! ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఉండటంతో ‘కాంతార’ను అందరూ ఇష్టపడ్డారు.
పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నారు కానీ, ఎప్పట్నుంచో ఉన్నదే! నా చిన్నప్పుడు మణిరత్నం గారి ‘రోజా’, ‘బొంబాయి’ సినిమాలు విడుదలయ్యాయి. వాటి మాతృక తమిళమే అయినా తెలుగు, హిందీ భాషల్లోనూ ఆ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ కూడా పాన్ ఇండియా సినిమానే!
హిందీ చిత్ర పరిశ్రమ కొంత ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే! అయితే, ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు బాలీవుడ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. గంగూబాయి కాఠియావాడీ, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలు బాక్సాఫీస్‌లో కదలిక తీసుకొచ్చాయి. ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా.
ప్రస్తుతం స్టార్డమ్కు అర్థం మారిపోయింది. ఒకప్పుడు నటుల గురించి తెలుసుకోవడానికి వాళ్లు నటించిన సినిమాలు తప్ప మరో అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు నటీనటులంతా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. ప్రేక్షకులు కూడా నటులను సెలెబ్రిటీలుగానో, స్టార్స్గానో కాకుండా ఎంటర్‌టైనర్స్‌గా భావిస్తున్నారు.
Read More :
NBK107 | వీరసింహా రెడ్డి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

