Jai Hanuman | ‘జై హనుమాన్’ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఇటీవలే ఇందులో హనుమాన్‌గా ‘కాంతార’ఫేం రిషబ్‌శెట్టిని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆడియన్స్‌ని ఓ రేంజ్లో ఆకట్టుకున్నది. తాజాగా ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చారు ప్రశాంత్‌వర్మ.
నటుడు రానా, రిషబ్‌శెట్టితో కలిసి దిగిన ఫొటోను తన ఎక్స్(ట్విటర్)లో పంచుకుంటూ.. దానికి ‘జై జై హనుమాన్’ అని క్యాప్షన్ జోడించి, రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ను కోట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫొటో ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. రానా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నాడని ఈ పోస్ట్ చెప్పకనే చెప్పింది. ఒక వేళ చేస్తే అది కథను మలుపుతిప్పే పాత్రే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.