Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
Ramya Krishna | వెండితెరపై తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ వేదికపై ఆమె కనిపిస్తే సందడి మరో స్థాయికి చేరుతుంది. గతంలో తెలుగు బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్ సీజన్ 10లోనూ వ్యాఖ్యాతగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Ramya Krishna | వెండితెరపై తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ వేదికపై ఆమె కనిపిస్తే సందడి మరో స్థాయికి చేరుతుంది. గతంలో తెలుగు బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్ సీజన్ 10లోనూ వ్యాఖ్యాతగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.తమిళ బిగ్‌బాస్ కార్యక్రమానికి గత మూడు సీజన్లుగా నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గొంతు సంబంధిత సమస్య కారణంగా ఆయన ఈ వీకెండ్ ఎపిసోడ్లకు దూరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు.
విజయ్ సేతుపతికి గొంతు సమస్య ఉన్న విషయాన్ని రమ్యకృష్ణ స్వయంగా వెల్లడించింది. ఇక తన గంభీరమైన స్వరం, ప్రత్యేకమైన మాటతీరుతో ఆమె బిగ్‌బాస్ వేదికపై కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇంటి సభ్యులతో మాట్లాడే విధానం, వారి ఆటతీరుపై స్పందించిన తీరు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే రమ్యకృష్ణ కేవలం ఈ వీకెండ్ ఎపిసోడ్లకే పరిమితం అవుతారా? లేక మరికొన్ని వారాలు హోస్ట్‌గా కొనసాగుతారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై కార్యక్రమ నిర్వాహకుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.ప్రస్తుతం రమ్యకృష్ణ పారితోషికం గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. తమిళ బిగ్‌బాస్ సీజన్ 10లో హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.15 లక్షలు అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిగ్‌బాస్ వీకెండ్ కార్యక్రమాలు సాధారణంగా రెండు రోజుల పాటు ప్రసారమవుతాయి. ఈ లెక్కన రెండు ఎపిసోడ్లకు కలిపి ఆమెకు సుమారు రూ.30 లక్షలు పారితోషికంగా అందుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తానికి సంబంధించి రమ్యకృష్ణగానీ, కార్యక్రమ నిర్వాహకులుగానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రమ్యకృష్ణకు బిగ్‌బాస్ కార్యక్రమంతో గతంలోనూ అనుబంధం ఉంది. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో నాగార్జున అందుబాటులో లేని సమయంలో ఆమె ఒక వారం పాటు హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కమల్ హాసన్ అందుబాటులో లేనప్పుడు కూడా వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి తమిళ బిగ్‌బాస్ వేదికపైకి రావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ సినీ అనుభవం, ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యక్తిత్వం రమ్యకృష్ణకు అదనపు బలంగా నిలుస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Don’t Trouble the Trouble | ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

