Double Ismart | ఆగస్ట్ 15న పాన్ఇండియా స్థాయిలో.. డబుల్ ఇస్మార్ట్ కౌంట్‌డౌన్ షురూ
రామ్ పోతినేని కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌శంకర్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా రెట్టింపు వినోదంతో ‘డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 15న పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Double Ismart | రామ్ పోతినేని కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌శంకర్’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా రెట్టింపు వినోదంతో ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదలకు ఇంకా 50రోజుల సమయమే ఉన్నందున కౌంట్‌డౌన్ చెబుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు.
నాటి ‘ఇస్మార్ట్‌శంకర్’ని తలపిస్తూ.. డబుల్ జోష్ని ప్రేక్షకులకు అందించేలా రామ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. కథ, కథనాలతోపాటు పాత్రల తీరుతెన్నులు ఇందులో కొత్తగా ఉంటాయని, ఎక్సయిట్మెంట్, ఎంటర్టైన్మెంట్ రెండూ సమపాళ్లలో ఉండే ఈ కథలో సంజయ్‌దత్ పాత్ర చాలా కీలకమని, రామ్‌తో ఆయన కాంబినేషన్ సీన్స్ మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు.
కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, గెటప్ శీను ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సామ్ కె.నాయుడు, జియాని జియానెలి, సంగీతం: మణిశర్మ. పూరీజగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో చార్మీకౌర్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

