Ram Pothineni | బాలకృష్ణ అభిమానిగా రామ్పోతినేని.. ఏ సినిమాలో తెలుసా?
Ram Pothineni-Boyapati sreenu Movie | విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’లో కూడా సిద్ధార్థ పాత్రతో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ది వారియర్’ కూడా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటి వరకు మాస్ కథలను ఎంచుకున్న రామ్ ఈ సారి ఏకంగా మాస్ డైరెక్టర్ బోయపాటితోనే చేతులు కలిపాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ మొదలు పెట్టనుంది. లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రామ్.. బాలయ్య అభిమానిగా నటించనున్నాడట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. రామ్ నటించిన ‘ది వారియర్’ జూలై 14న విడుదల కానుంది. ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

