RC16 | ఉప్పెన తర్వాత మూడేళ్లు ఖాళీగానే ఉన్నాడు బుచ్చిబాబు. మధ్యలో ఎంతమంది హీరోలు వచ్చినా.. ఎంతమంది నిర్మాతలు వచ్చి కోట్ల రూపాయల అడ్వాన్స్‌లు ఇచ్చినా కూడా ఆయన కాదు అన్నాడు. చేస్తే పెద్ద సినిమా చేయాలని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు ఈ కుర్ర దర్శకుడు. అందుకే ఉప్పెన తర్వాత మాతో సినిమా చేయంటూ రూ.15 కోట్ల ఆఫర్స్ ఇచ్చిన నిర్మాతలకు కూడా నో చెప్పాడు బుచ్చిబాబు. నిజం చెప్పాలంటే ఉప్పెన విడుదల తర్వాత బుచ్చిబాబు డైరీ ఫుల్ అయిపోయింది.
ఆయన ఒప్పుకోవాలే కానీ చాలామంది హీరోలు క్యూలో ఉన్నారు. మీడియం రేంజ్ హీరోలైతే ఆయనతో సినిమా చేయడానికి ఎగబడ్డారు. కానీ ఆయన మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో పెద్ది సినిమా చేయాలని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు. కాకపోతే ఎన్టీఆర్ మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు బిజీగా ఉండటంతో.. తన కథను రామ్ చరణ్ వైపు మళ్లించాడు. ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ ఇది కాదని బుచ్చిబాబు చెబుతున్నా కూడా.. ఇంటర్నల్ సర్కిల్స్ ప్రకారం అదే కథను కాస్త మార్చి చేస్తున్నాడు అని వినిపిస్తుంది. అంతా బాగానే ఉంది అనుకున్నట్టుగానే రామ్ చరణ్ సినిమా మొదలు పెట్టాడు బుచ్చిబాబు. కానీ ఈ సినిమాతో అతిపెద్ద సవాల్ దాటాల్సి ఉంది ఈ దర్శకుడు. RC16కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించాలని ఫిక్స్ అయినప్పుడే రెహమాన్ వైపు చూపు మళ్లించాడు బుచ్చిబాబు. ఎందుకంటే అక్కడ రెహమాన్ పేరు కనిపిస్తే ఆటోమేటిక్‌గా గ్లోబల్ స్టేజి మీద సినిమాకు పాపులారిటీ వస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీ వరకు ఏఆర్ రెహమాన్ ఒక నెగిటివ్ సెంటిమెంట్. ఇంతవరకు ఆయన తెలుగులో సంగీతం అందించిన ఒక్క సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
నాటి గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్ నుంచి మొదలు పెడితే నీ మనసు నాకు తెలుసు, పులి, నాని వరకు ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. పాటల పరంగా సూపర్ హిట్ అయినా కూడా సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఏ మాయ చేసావే విజయం సాధించినా కూడా అది ద్విభాషా చిత్రం. నేరుగా తెలుగులో ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ సినిమాలు ఒకటి కూడా హిట్ కాలేదు. ఇప్పుడు ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నా కూడా బుచ్చిబాబు తన సినిమాకు రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. తన సినిమాకు ఆయన బ్రాండింగ్ కావాలి అనుకున్నాడు.. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ అసలు పట్టించుకోలేదు ఈ దర్శకుడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టానున్నారు రామ్ చరణ్, బుచ్చిబాబు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా ఇచ్చేశాడు రెహమాన్. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి చూడాలిక.. ఈ నెగిటివ్ సెంటిమెంట్ దాటి బుచ్చిబాబు ఎంతవరకు విజయాన్ని అందుకుంటాడనేది..!