రామాయణ విడుదలకు రంగం సిద్ధం
నవరాత్రుల తొలిరోజున ‘రామాయణ’ మేకర్స్ ప్రత్యేక ప్రకటన చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ఇతిహాసానికి చెందిన తొలి భాగాన్ని ఈ ఏడాది నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యంగా భారత్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా రణబీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణుడిగా కనిపిస్తున్న కొత్త పోస్టర్ని విడుదల చేశారు. కథలోని పాత్రల వ్యత్యాసాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ని రూపొందించారు. భారీ సెట్లు, అద్భుతమైన ఆహార్యం.. ఇలా ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు ఈ పోస్టర్ చెబుతున్నది.
‘ఇది రాముడి యుగానికి ఆరంభం’ అనే సందేశంతో ఓ కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా పౌరాణిక ఫ్రాంచైజీని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కి చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, DNEG భాగస్వామ్యంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

