Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Lara Dutta as Kaikeyi | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' (Ramayana) నుంచి మేకర్స్ వరుస అప్డేట్లతో అంచనాలను పెంచుతున్నారు.
Lara Dutta as Kaikeyi | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) నుంచి మేకర్స్ వరుస అప్డేట్లతో అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య రాజసౌధంలో అంతర్గత రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచే మహారాణి కైకేయి, మంథర పాత్రల అధికారిక క్యారెక్టర్ పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది.
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కైకేయి పాత్రలో ప్రముఖ నటి లారా దత్తా (Lara Dutta) నటిస్తుండగా, ఆమెకు కుట్రపూరిత ఆలోచనలు నూరిపోసే మంథర పాత్రలో సీనియర్ నటి షీబా చద్దా (Sheeba Chaddha) కనిపించనున్నారు. ఇక విడుదలైన పోస్టర్లో లారా దత్తా ఎంతో రాజసం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలు, తలపై కిరీటంతో రాచరిక లుక్‌లో కనువిందు చేస్తున్నారు. ఆమె ముఖంలో తీవ్రమైన, ఆందోళనతో కూడిన భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మంథర పాత్రలో షీబా చద్దా ముదురు రంగు దుస్తులు, తలపై సాంప్రదాయ వెండి ఆభరణం ధరించి కర్ర పట్టుకుని ఎంతో తీవ్రమైన, లెక్కలేసుకునే చూపులతో విలక్షణమైన రూపంలో కనిపిస్తున్నారు.
ఒక రాణి.. ఒక తల్లి.. తండ్రి ప్రేమను వంచించి, రాముడి తలరాతను మార్చేసే రెండు కోరికలు. ఒక కుట్రపూరితమైన మనసు.. ఆమె ఊహాగానాలు ఒక తల్లి ప్రేమను రాజ్యానికి చీకటి రోజులుగా మార్చేస్తాయి అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్లకు పవర్ఫుల్ క్యాప్షన్‌ను జోడించారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, యశ్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. అలాగే దశరథ మహారాజుగా నటుడు అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. ఈ చిత్ర మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దీపావళి 2026 కానుకగా విడుదల కానుండగా, రెండో భాగం దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

