సినిమా : స్కంద
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీకాంత్, సయీ మంజ్రేకర్..
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: శ్రీనివాసా చిట్టూరి, పవన్‌కుమార్
Skanda Review | మాస్ ప్రేక్షకులకు ఇష్టమైన హీరోల్లో రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. ఇక బోయపాటి శ్రీను (Boyapati Srinu) అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు పెద్దస్థాయిలో ఉండటం మామూలే. పైగా ‘అఖండ’ లాంటి బ్లాక్బాస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్లు ఆకాశంలో ఉంటాయ్. అందుకు తగ్గట్టే నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ గురువారం విడుదలైన ‘స్కంద’ అందరి అంచనాలనూ అందుకున్నాడా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ గురించి..
రామకృష్ణంరాజు అనే ప్రముఖపారిశ్రామికవేత్తను దారుణమైన నేరాలు చేశాడనే అభియోగంతో కోర్టు ఉరిశిక్ష విధించడంతో కథ మొదలవుతుంది. కట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమార్తె వివాహం. ముఖ్యమంత్రి నివాసం పెళ్లి హడావిడితో కోలాహలంగా ఉంది. ఇంతలో పెళ్లి కూతురిని పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు తీసుకెళ్లిపోయాడనే పిడుగులాంటి వార్త. దీంతో మిత్రులైన ముఖ్యమంత్రులిద్దరూ శత్రువులయ్యారు. ‘నిన్నూ, నీకొడుకునీ చంపుతా..’అని ఏపీ ముఖ్యమంత్రి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రితో సవాలు చేశాడు. చంపడానికి ప్రయత్నాలు మొదలయ్యాయ్. కానీ ఓ కుర్రాడి కారణంగా అవి విఫలమవుతున్నాయ్. అసలు విషయం ఏంటంటే.. ఆ ప్రయత్నాలు చేస్తున్న అగంతకుడు ఏపీ ముఖ్యమంత్రి పంపినవాడు కాదు. ఆ విషయం పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసి, వాడ్ని చంపేలోపే ఏపీ ముఖ్యమంత్రి పంపిన అసలు హంతకులు రంగంలోకి దిగారు. అయితే, వాళ్లందర్నీ.. ఇంతకుముందు హత్యాయత్నాల విఫలానికి కారణమైన కుర్రాడే అడ్డుకుని చంపేశాడు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ఈ కుర్రాడికీ ముఖ్యమంత్రులకీ సంబంధమేంటి? పారిశ్రామికవేత్త రామకృష్ణంరాజు చేసిన నేరం ఏంటి? అసలు రమకృష్ణంరాజుకీ, ముఖ్యమంత్రులకీ సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
కథా విశ్లేషణ..
ఫిక్షన్ సినిమా అయితే, కథలో లాజిక్కులు అక్కర్లేదు. ఏం చూపిస్తే అది చూస్తారు జనం. మామూలు మాస్ సినిమా చేసినప్పుడు యాక్షన్ సన్నివేశాల్లో లాజిక్కులు లేకపోయినా.. కథలో కచ్ఛితంగా ఉండాల్సిందే. అసాధ్యమైన పనులు హీరో చేస్తున్నాడూ అంటే.. ముందు అతని శక్తియుక్తుల్ని జనం నమ్మాలి. నమ్మేలా దర్శకుడు ఒప్పించాలి. అంతేకానీ ఫిక్షన్ సినిమాల్లో హీరోలా ఏదిపడితే అది తెరపై చేస్తే హీరో కేరక్టర్
అభాసుపాలవుతుంది. అసలు రాష్ట్రముఖ్యమంతి అంటే ఏంటి? ఆ స్థానానికుండే పవర్సేంటి? ఓ సామాన్యుడు ముఖ్యమంత్రులతో తలపడాలంటే ఎలా తలపడొచ్చు? ఇలాంటి అంశాలపై కథ రాయాలి అంటే.. కచ్ఛితంగా కొన్ని విషయాలపై అవగాహన అవసరం. ఆ అవగాహన ఈ కథలో లోపించిందని చెప్పకతప్పదు. కథ అసలు నేలపై నడవదు. అసంభవమైన అంశాలన్నీ తెరపై కనిపిస్తుంటాయ్. కథనం అంతా గందరగోళం. సినిమా అంతా యాక్షన్ ఎపిసోడ్లే. హీరో వందలమందిని నరికేశాడు. తెరంతా రక్తసిక్తం.. ఎటుచూసినా కళేబరాలు, శరీరభాగాలు. హీరో అనేవాడు ఎంత నరికితే సినిమా అంత హిట్ అవుతుందనుకుంటే ఎలా? తెరపై మాస్ హీరో అంటే, ప్రేక్షకుడు ఇగోని తృప్తిపరిచేవాడిలా ఉండాలి. మనకు తప్పు అనిపించినదాన్ని మన తరపున ప్రశ్నించేవాడిలావుండాలి. ప్రతిఘటించేవాడిలా వుండాలి. అంతేకానీ, నరుక్కుంటూపోవడమే హీరోయిజం అనుకుంటే ఎలా?
నటీనటుల నటన..
హీరో రామ్ మాస్ కేరక్టర్లు చేయడంలో దిట్ట. తగ్గట్టే తగిన న్యాయం చేశాడు. ఇందులో ఆయనది డ్యూయెల్ రోల్. రెండూ పాత్రలకూ తేడా బాగానే చూపించాడు. డాన్స్ కూడా ఇరగదీశాడు. శ్రీలీల కూడా డాన్సులు బాగా చేసింది. యాక్టింగ్ పరంగా చేయటానికి ఏంలేదు. ఇందులో ఎవరి పాత్ర వాళ్లు చేసుకుపోయారు. నటనపరంగా కాస్త్తోకూస్తో మెరిసింది శ్రీకాంతే. వారందరిమధ్య శ్రీకాంత్‌ని చూస్తే ‘బాగా చేశాడే’ అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
ఏ విషయంలోనైనా తెలిసింది చేయాలనుకున్నప్పుడు దానిపై నియంత్రణ కూడా అవసరం. శృతిమించిన ఉద్వేగాలు అసహనానికి గురిచేస్తాయి. దర్శకుడు బోయపాటి శ్రీను నరుకుళ్లు తగ్గించుకొని, ఉద్వేగాలనే కాకుండా కాస్త భావోద్వేగాల గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది. ఆయన హిట్ సినిమాల్లో భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయ్. ఇందులో అవి లోపించాయేమో అనిపిస్తుంది. హీరోయిజంపైనే కాకుండా కథపై కూడా కాస్త శద్ధ పెడితే ఫలితం వేరేలా ఉండేదేమో.. ఇక తమన్ తన నేపథ్య సంగీతంతో ఎప్పట్లాగే మోతమోగించాడు. ఒకట్రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయ్. కెమెరామ్యాన్ కష్టం తెరపై కనిపించింది. రత్నం డైలాగులు అక్కడక్కడ బాగానే మెరిశాయ్. సాంకేతికంగా సినిమా బాగానేవుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదని ప్రొడక్షన్ వ్యాల్యూస్ చెబుతున్నాయ్. మొత్తంగా మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘స్కంద’ నచ్చొచ్చు.
ప్లస్ పాయింట్స్:
రామ్, శ్రీకాంత్ నటన, శ్రీలీలతో కలిసి ఆయన డాన్సులు, తమన్ నేపథ్యసంగీతం..
మైనస్ పాయింట్స్..
కథ, శృతిమించిన హింస..
రేటింగ్ : 2.25/5
స్కంద ప్రమోషన్స్..
The Electrifying Duo, Ustaad @ramsayz & Energetic @sreeleela14 special interview with @itsSumaKanakala garu ❤️🔥💥
Stay Tuned!#RAPOMass #SkandaOnSep28#BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/o6YrCCW6od
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 22, 2023
The Electrifying Duo, Ustaad @ramsayz & Energetic @sreeleela14 special interview with @itsSumaKanakala garu ❤️🔥💥
Stay Tuned!#RAPOMass #SkandaOnSep28#BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/gMehItwx21
— BA Raju’s Team (@baraju_SuperHit) September 22, 2023
#skanda promotions start pic.twitter.com/TZeSpUrdm2
— devipriya (@sairaaj44) September 22, 2023
Ustaad @ramsayz just Killing it in Uber Cools Looks & charming smile during the #Skanda Promotions✨️#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam🔥#RAPOMass @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake… pic.twitter.com/lbTvMmIgob
— Vamsi Kaka (@vamsikaka) September 22, 2023
#Skanda will be releasing in 𝟑𝟓𝟎+ 𝐋𝐎𝐂𝐀𝐓𝐈𝐎𝐍𝐒 across USA – Biggest Ever for our Ustaad @ramsayz
🔥🔥THEATRES LIST & Booking Update this weekend, stay tuned!
Overseas Release by @VarnikhaVisuals in association with @CharismaEntmt
Premieres on 𝟐𝟕𝐭𝐡 𝐒𝐄𝐏𝐓💥… pic.twitter.com/AFH3QKSuyT
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 14, 2023
స్కంద ట్రైలర్‌కు రికార్డు వ్యూస్..
A Massive Milestone!!❤️🔥#SkandaTrailer rage hits 50 Million+ Views on YouTube💥
– https://t.co/iCeVlangrt#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens… pic.twitter.com/7niyRGB99n
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 7, 2023
స్కంద ట్రైలర్..
స్కంద టైటిల్ గ్లింప్స్..
డుమ్మారే డుమ్మా సాంగ్..
గండరబాయ్ సాంగ్..
నీ చుట్టూ చుట్టూ సాంగ్..