దీపిక ఎంటర్టైన్మెంట్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘రామ్’ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్). సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘దేశభక్తి నేపథ్యంలో సాగే కథాంశమిది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం.
హృదయానికి హత్తుకునే ఎమోషన్స్‌తో పాటు సందేశాత్మక కథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ధన్య బాలకృష్ణ, భానుచందర్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: దీపికాంజలి వడ్లమాని, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ.