Ram Gopal Varma | నా కెరీర్లో చెత్త సినిమా అదే.. కానీ అదే నా జీవితాన్ని మార్చింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ
Ram Gopal Varma | వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం, వ్యక్తిత్వం, విజయాలు, వైఫల్యాలతో పాటు జీవితంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్లో అత్యంత చెత్త సినిమాగా ఏ చిత్రాన్ని భావిస్తారన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Ram Gopal Varma | వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం, వ్యక్తిత్వం, విజయాలు, వైఫల్యాలతో పాటు జీవితంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్లో అత్యంత చెత్త సినిమాగా ఏ చిత్రాన్ని భావిస్తారన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన కెరీర్లో అత్యంత నిరాశపరిచిన చిత్రంగా అంతంను పేర్కొన్న వర్మ, ప్రముఖ రచయిత జేమ్స్ హాడ్లీ ఛేజ్ నవల ఆధారంగా తెరకెక్కించిన ఆ చిత్రాన్ని తాను అనుకున్న స్థాయిలో మలచలేకపోయానని చెప్పారు. అయితే, అదే సినిమా తన బాలీవుడ్ ప్రయాణానికి బలమైన పునాది వేసిందని వెల్లడించారు. ‘అంతం’ ద్వారానే నటి ఊర్మిళ మటోండ్కర్ పరిచయం అయ్యారని, ఆ తర్వాత ఆమెతో కలిసి రూపొందించిన రంగీలా తన కెరీర్లో పెద్ద మలుపు తీసుకొచ్చిందని చెప్పారు.
అంతేకాదు, ‘అంతం’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అదే కథాంశాన్ని మరో కోణంలో ఆవిష్కరిస్తూ సత్యను రూపొందించినట్లు తెలిపారు. ఈ రెండు చిత్రాలే తన సినీ ప్రయాణంలో అత్యంత కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకుల దృష్టిలో ‘అంతం’ ఫ్లాప్ సినిమా కావొచ్చని, కానీ తన జీవితంలో మాత్రం అది ఎంతో విలువైన చిత్రమని వర్మ అన్నారు. ప్రతి అనుభవం మనిషిని తీర్చిదిద్దుతుందని, తాను చేసిన తప్పులు కూడా చివరికి తనకు మేలు చేశాయని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ ఏ విషయంపైనా పశ్చాత్తాపం చెందలేదని, ప్రతి సంఘటన తన వ్యక్తిత్వాన్ని మరింత బలపరిచిందని వివరించారు.
తన తాజా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జీవితానికి సంబంధించిన సినిమా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆ సినిమా దాదాపు 30 శాతం పూర్తయిందని, ఇప్పటికే కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. కోపం అనే భావోద్వేగం తనకు ఉండదని వర్మ స్పష్టం చేశారు. కోపం వచ్చేంత ప్రాధాన్యతను తాను ఎవరికీ ఇవ్వనని చెప్పారు. అయితే, అర్థంలేని ప్రశ్నలు అడిగినా లేదా తన పనికి అంతరాయం కలిగించినా చిరాకు వస్తుందని పేర్కొన్నారు.చిరాకు, కోపం రెండూ వేర్వేరు. చిరాకు అంటే తాత్కాలిక ఇరిటేషన్ మాత్రమే. కోపం మాత్రం ఒక భావోద్వేగం అని ఆయన వివరించారు. జీవితానికి ఎలాంటి నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోలేదని వర్మ తెలిపారు. గతం ముగిసిపోయిందని, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని, అందుకే ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఆస్వాదించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు.భయం కూడా తనకు లేదని, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

