Nikhil Next Movie | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఇటీవలే యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేశాడు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో ఈ ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేసినట్లు ఈ సంస్థ తెలిపింది. తాజాగా ఈ సంస్థ తమ మొదటి సినిమాను ప్రకటించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న నిఖిల్‌తో తొలి చిత్రాన్ని చేయనున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ సినిమాకు ది ఇండియా హౌజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
1900 దశకం సమయంలో భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఒక అధ్యాయాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్రబృందం వీడియోలో పేర్కొంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. నిఖిల్ ఈ సినిమాలో శివ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఏజెంట్ గెటప్‌లో సూట్‌కేసు పట్టుకున్న నిఖిల్ లుక్ అదిరిపోయింది. అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.
ప్రస్తుతం నిఖిల్ నటించిన స్పై మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకులు ముందుకు రానుంది.
On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film – THE INDIA HOUSE
headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023