ఈ నెలలోనే ముహూర్తం?
‘రంగస్థలం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన రామ్‌చరణ్-సుకుమార్ ద్వయం కలయికలో మరో భారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.
‘రంగస్థలం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన రామ్‌చరణ్-సుకుమార్ ద్వయం కలయికలో మరో భారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీ17’వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నాయి. ఇటీవలే ఈ సినిమా తాలూకు ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ నెలలోనే సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చిత్రబృందం సాంకేతిక నిపుణుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నదని తెలిసింది. సంగీత దర్శకులుగా దేవిశ్రీప్రసాద్, అనిరుధ్ రవిచందర్, ‘ధురందర్’ ఫేమ్ శశ్వత్ సచ్దేవ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కథానాయికగా సారా అర్జున్ పేరు వినిపిస్తున్నది. సినిమా లాంచింగ్ రోజే ప్రధాన నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని వెల్లడించే అవకాశాలున్నాయి. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ తర్వాత సుకుమార్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తినెలకొంది.
ఈ సినిమా కోసం సుకుమార్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? కథా నేపథ్యం ఏమిటనే విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెలువడే అవకాశముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

