బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలిగిన సుమ కనకాల ఇప్పటికీ స్టార్ యాంకర్‌గానే కొనసాగుతుంది. కేరళలో పుట్టిపెరిగిన ఈ మలయాళీ భామ తెలుగుపై పట్టు సాధించి, తిరుగులేని యాంకర్ గా ఎదిగారు. అయితే తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవల పేర్కొంది సుమ. ఇన్నాళ్లు నన్ను బుల్లితెర మీద ఆదరించినందుకు, మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. దేవుడి దయతో ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాను’ అంటూ పోస్టర్ షేర్ చేశారు సుమ.
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న సినిమాలో సుమ నటిస్తుండగా, ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నారు. పోస్టర్లో సుమ చేయి మీద వెంకన్న అనే పేరుతో ఉన్న పచ్చబోట్టు చూపించారు. రేపు ఉదయం చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించనున్నారు. దీంతో సినిమాకు ఫుల్ మైలేజ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.
1996లో దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సుమ తర్వాత బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాలో అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ పాడి అలరించారు సుమ. వర్షం, ఢీ, బాద్ షా, ఓ బేబీ చిత్రాలలో సుమ చిన్న చిన్న పాత్రలు చేశారు.