యాక్షన్ సినిమాల పట్ల తన ఇష్టాన్ని మరోసారి వెల్లడించారు స్టార్ హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ విదేశాల్లో చేస్తున్న హంగామాలో భాగమవుతున్న రామ్ చరణ్…అక్కడి మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. వాటిలో భాగంగా స్పందిస్తూ..‘హాలీవుడ్ యాక్షన్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్లను అభిమానిస్తాను. వీళ్లిద్దరి నటన స్ఫూర్తినిస్తుంది. బ్రాడ్ పిట్ ‘వన్స్ ఆపానే టైమ్ ఇన్ హాలీవుడ్’, టామ్ క్రూజ్ ‘టాప్ గన్ మెర్విక్’ చిత్రాలు నాకు ఆల్టైమ్ ఫేవరేట్ మూవీస్. దశాబ్దాలుగా అదే ఫిట్నెస్, అందంతో కనిపిస్తున్నారు. నటులుగా ఎదుగుతూ అభిమానులకు దగ్గరవుతున్నారు’ అని అన్నారు.