ఒక్కసారి కథ నచ్చాక, ఇక సినిమా బాధ్యతంతా దర్శకుడిపై వేసేసి.. ప్రశాంతంగా షూటింగ్ కానిచ్చేస్తుంటారు రామ్‌చరణ్. కానీ దర్శకుడు బుచ్చిబాబు సాన సినిమా విషయంలో మాత్రం రామ్‌చరణ్ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ‘గేమ్‌చేంజర్’ షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్.. విరామం దొరికితే చాలు, బుచ్చిబాబు సినిమా కథా చర్చల్లో భాగమవుతున్నారట. ఆ కథ బాగా నచ్చడం వల్లే చరణ్ అంత అమితాసక్తి చూపిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
పేపర్ వర్క్ విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడంతోపాటు పాత్రను అర్థం చేసుకునే పనిలో ఉన్నారట చరణ్. బుచ్చిబాబు కూడా చరణ్‌కి పూర్తిగా సహకరిస్తున్నారట. క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహ్మాన్.