రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట పెళ్లి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండగడీ కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం కోటలో పోచమ్మ పండుగ నిర్వహించారు. మరదలి వివాహ వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే చెర్రీ.. మరదలి సంగీత్ సెలబ్రేషన్స్ బాధ్యతను బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఈవెంట్‌ను తనకు అప్పగించడంతో యానీ మాస్టర్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది.
అనుష్పాల పెళ్లి కోసం రామ్ చరణ్ ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక తన పెళ్లి సందర్బంగా అనుష్పాల.. నిన్న నెట్టింట్లో మెరిసింది. ఉపాసనతో కలిసి సింహాలను దత్తత తీసుకుంది అనుష్పాల. అలా ఈ సిస్టర్స్ ఇద్దరూ కూడా నెట్టింట్లో సందడి చేశారు. ఇప్పుడేమో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో అనుష్ పాల, ఉపాసన సందడి చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.