Ram Charan – Upasana | పుట్టబోయే బిడ్డ కోసం అందమైన గిఫ్ట్ అందుకున్న ఉపాసన
Ram Charan - Upasana | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన (Upasana) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ అందమైన గిఫ్ట్ ను అందుకున్నారు.
Ram Charan – Upasana | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan)- ఉపాసన (Upasana) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఈ జంటకు పుట్టబోయే బిడ్డ కోసం మెగా కుటుంబంతోపాటు, అభిమానులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జులై నెలలో ఉపాసన డెలివరీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజాగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ అందమైన గిఫ్ట్ ను అందుకున్నారు. ప్రజ్వలా ఫౌండేషన్ (Prajwala Foundation) వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఉయ్యాల (Handcrafted Cradle)ను ఉపాసన-చరణ్ దంపతులకు బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఉప్సీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఉయ్యాలను తయారు చేస్తున్న వీడియోను పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.
‘మీ (ప్రజ్వలా ఫౌండేషన్) నుంచి ఈ అద్భుత కానుకను అందుకోవడం ఎంతో గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. మీ చేతులతో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ధైర్యం, బలం, ఆత్మగౌరవం, ఆశకు ప్రతీక. మీరు పంపిన ఈ అద్భుత కానుక నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రజ్వలా ఫౌండేషన్ సెక్స్ ట్రాఫికింగ్ బాధిత మహిళలకు ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Adipurush | దేశ ప్రజలకు ఆదిపురుష్ టీం క్షమాపణలు చెప్పాలి : శివసేన ఎంపీ
Uganda School | ఉగాండాలో దారుణం.. పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 25 మంది మృతి
Manipur Violence | మణిపూర్ ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు.. ఆర్మీ విశ్రాంత అధికారుల ఆవేదన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

