Ram-Boyapati Sreenu Movie | ఇప్పటి తరానికి మాస్ సినిమాలంటే టక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. ఎలివేషన్స్, మాస్ ఫైట్స్, యాక్షన్ ఇలా బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ బోయపాటి సినిమాలో పుష్కలంగా ఉంటాయి. ఆయన సినిమాలు వస్తున్నాయంటే సింగిల్ థియేటర్లలో సినీ లవర్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక బోయపాటి మాస్ ఎలివేషన్స్ గురించి ఒక పుస్తకమే రాయచ్చు. ప్రస్తుతం టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా బోయపాటి మారిపోయాడు. అఖండ వంటి బంపర్ హిట్ తర్వాత బోయపాటి రామ్‌తో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. రెండు నెలల్లో విడుదల కాబోతున్న సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ మేరకు మాస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గ్లింప్స్‌లో రామ్.. దేవాలయంలోని నీటి గుండంలో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను నరుకుతూ ఊరమాస్ లెవల్లో కనిపించాడు. గ్లింప్సే ఈ రేంజ్ ఉంటే సినిమా ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో అని ఇప్పటి నుంచి మాస్ అభిమానులు ఊహల్లో తేలుతున్నారు. ఇప్పటికే రిలీజైన మాస్ థండర్‌కు ప్రేక్షకుల నుంచి తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక సెప్టెంబర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.