
టాలీవుడ్ హీరోయిన్లు తరచూ జిమ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఇన్స్పైర్ చేస్తుంటారు. పనిలోపనిగా డైట్ టిప్స్ చెబుతుంటారు. అందులో, ముందువరుసలో ఉంటుంది రకుల్‌ప్రీత్ సింగ్. తాజాగా, తన గ్లామర్‌కు కారణమైన సబ్జా గింజల పుడ్డింగ్తోపాటు పెరుగన్నం గురించీ చెప్పుకొచ్చింది. ‘పెరుగులో ఉండే లైవ్ మైక్రోబ్స్, సబ్జా గింజల్లోని ఫైబర్ నా ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కడుపులో ఎలాంటి గడబిడలూ లేకుండా చూస్తాయి. కాబట్టే నేనెప్పుడూ లైట్‌గా, సంతోషంగా ఉంటా’ అంటున్నది రకుల్.