Rajinikanth | భారతీయుడు-2 ను మెచ్చుకున్న రజనీకాంత్
విలక్షణ నటుడు కమల్‌హాసన్- సుప్రసిద్ద దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'భారతీయుడు-2'. 28 ఏళ్ల క్రితం ఇదే కలయికలో రూపొందిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. సిద్దార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
విలక్షణ నటుడు కమల్‌హాసన్- సుప్రసిద్ద దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు-2’. 28 ఏళ్ల క్రితం ఇదే కలయికలో రూపొందిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. సిద్దార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే చిత్రానికి మొదటిరోజే భారీ ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్‌పై విమర్శలు వెలువెత్తాయి. కంటెంట్ లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. కానీ సినిమా మత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అంటూ కమల్ అభిమనులతో పాటు సగటు ఆడియన్స్ కూడా నిరాశ చెందారు. కాగా ఇటీవల ఈ చిత్రానికి అందరి నుంచి నెగెటివ్ కామెంట్స్ లభించగా తాజాగా ఈ చిత్రం తనకు నచ్చిందని సినిమా బాగుందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కామెంట్స్ చేయడం అందరిన్ని ఆశ్చర్యపరిచింది. కేరళలోని ఓ వివాహానికి హాజరై చెన్నయ్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు రజనీకాంత్.
దీంతో పాటు బయట ప్రచారం జరగుతున్నట్లుగా తన ‘వేట్టయాన్’ సినిమా వాయిదా పడలేదని, షూటింగ్ శరవేగంగా జరుగుతుందని,తన పార్ట్ డబ్బింగ్ కూడా పూర్తయిందని.. దసరాకు చిత్రాన్ని విడుదల చేసే అవకాశం వుందని స్పష్టం చేశారు. సూర్యతో ‘కంగువ’ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇంతకు ముందు వేట్టయాన్ వాయిదాపై మాట్లాడారు. దీంతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో కూడా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా.. ఈ సినిమా రూపొందుతోంది. శ్రుతిహాసన్, సత్యరాజ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపిస్తారు.
Also Read :
Dhanush – Jr NTR | ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఉంది : ధనుష్
Bhaiyya Ji | ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘భయ్యాజీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Game Changer | అల్లు అర్జున్‌తో పోటీ పడనున్న రామ్ చరణ్.. క్రిస్మస్ బరిలో ‘గేమ్ ఛేంజర్’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

