Rajinikanth | బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘ధురంధర్ 2’ సినిమాపై ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న తరుణంలో తలైవా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, దర్శకుడు ఆదిత్య ధర్‌ను “బాక్సాఫీస్ కా బాప్” అంటూ కొనియాడారు. ‘ధురంధర్ 2’ ఒక అద్భుతమైన సినిమా అని, ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన చిత్రమని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు మూవీ టీంకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
రజనీకాంత్ కామెంట్స్‌కు దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు. మేమంతా రజనీకాంత్‌ను ఒక బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగాం. వినోదానికి ఆయనే అసలైన నిర్వచనం. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ అదే స్టైల్, గ్రేస్‌తో మ్యాజిక్ చేస్తున్న ఆయన నుంచి ప్రశంసలు రావడం నా జీవితంలోనే అతిపెద్ద గౌరవం అని తెలిపారు. అలాగే మమ్మల్ని పెద్ద కలలు కనేలా ప్రేరేపించిన వ్యక్తి నుంచి వచ్చిన ఈ అభినందనలు ఒక వరంలాంటివి అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘ధురంధర్ 2’ భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దేశీయంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. భారీ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ఈ సినిమా, రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది.
ఇప్పుడు రజనీకాంత్ వంటి లెజెండరీ స్టార్ నుంచి వచ్చిన ప్రశంసలతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. దీంతో లాంగ్ రన్లో ఈ చిత్రం ఇంకా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తలైవా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ‘ధురంధర్ 2’ ఇప్పుడు మరింత బలంగా నిలబడే అవకాశముందని భావిస్తున్నారు.కాగా, రజనీకాంత్ ప్రశంసలు ‘ధురంధర్ 2’ విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి.