Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ Rajinikanth తో తలైవా 171 (Thalaivar171) సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి కూలీ (Coolie) టైటిల్‌ను ఫైనల్ చేశారు. సూపర్ స్టార్ బంగారంతో డిజైన్ ఆయుధాలు, వాచ్ ఛైన్లతో చేస్తున్న స్టైలిష్ ఫైట్‌తో సాగుతున్న టీజర్ ఇంప్రెసివ్‌గా సాగుతూ.. అభిమానులకు కనువిందు చేసేలా సినిమా ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు టైటిల్ టీజర్ చెప్పకనే చెబుతోంది. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని.. రోబో సినిమా తర్వాత తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నానని ముందుగా చెప్పినట్టుగానే నయా అవతార్‌లో చూపించబోతున్నట్టు చెబుతున్నాడు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
కూలీ టైటిల్ టీజర్..
We love you Thalaiva @rajinikanth ❤️#Coolie 💪https://t.co/z9cVIUpTWL@anirudhofficial @anbariv @girishganges @philoedit @ArtSathees @sunpictures @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/aBA6DcW1mw
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 22, 2024