Rajinikanth-ishwaryarai | సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రోబో’. 2010లో వచ్చిన ఈ చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు అందరిని ఆకట్టుకుంది. శంకర్ ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు. హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం శంకర్ టేకింగ్‌కు ఫిదా అయ్యారు. ఇందులో రజినీ కాంత్, ఐశ్వర్య నటనకు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. సినిమా వచ్చి పన్నేండెళ్లయినా ఇప్పటికి కొత్తగానే కనిపిస్తుంది. ఇక తాజాగా కోలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ కలసి మళ్లీ నటించబోతున్నారని టాక్.
‘అన్నాతే’ తర్వాత తలైవా, నెల్సన్‌కుమార్ దర్శకత్వంలో ‘తలైవర్169’ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రజినీకి జోడిగా అందాలతారను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే దర్శక నిర్మాతలు ఐష్‌తో సంప్రదింపులు జరిపారని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ కుమార్ ‘బీస్ట్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపైన ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన అరబిక్ సాంగ్ యుట్యూబ్లో 6.5 కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రం తరువాతే ‘తలైవర్ 169’ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.