Rajinikanth | తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రీసెంట్గా జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న తలైవా ప్రస్తుతం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో Thalaivar 170గా వస్తోన్న చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అభిమానుల కోసం డబుల్ బొనాంజా అప్డేట్స్ ఇవ్వబోతుంది రజినీకాంత్ టీం. తలైవా కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్‌గా నిలిచిన ముత్తు (Muthu) రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెలలో విడుదల కానుంది.
అయితే ఏ రోజనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్. వీటిలో తమిళ్ వెర్షన్ సందడి చేయనుందని తెలుస్తోండగా.. తెలుగు వెర్షన్ విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు తెలుగు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు. మరో బ్లాక్ బస్టర్ శివాజీ.. ది బాస్ (Sivaji The Boss) డిసెంబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండు సినిమాల విడుదల సూపర్ స్టార్ బర్త్‌డేకు అదిరిపోయే సెలబ్రేషన్స్ పక్కా అని అర్థమవుతోంది. శివాజీ విడుదలవుతుందన్న అప్డేట్తో తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోవైపు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు.