Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న క్రేజీ సినిమాల్లో ఒకటి కూలీ (Coolie). తలైవా 171 (Thalaivar171) గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీకాంత్ అబుదాబి ట్రిప్‌ను ముగించుకొని చెన్నైకి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు నుంచి తలైవా వస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తలైవా ఇక కూలీ షూటింగ్‌తో బిజీగా కాబోతున్నాడు.
త్వరలో మేకర్స్ షూటింగ్ అప్డేట్ వివరాలు కూడా వెల్లడించనున్నట్టు టాక్. కాగా పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కూలీలో రజినీకాంత్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు స్టన్నింగ్‌గా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు టైటిల్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని.. రోబో సినిమా తర్వాత తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నానని లోకేశ్ కనగరాజ్ ముందుగా చెప్పినట్టుగానే కూలీలో చూపించబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
#Rajinikanth Remuneration For #Coolie – 260 CRORES [including Shares ]✅#LokeshKanagaraj Remuneration For #Coolie – 60 CRORES 😳😳😳💥💥💥 pic.twitter.com/gbP4wrV9dk
— GetsCinema (@GetsCinema) May 14, 2024
కూలీ టైటిల్ టీజర్..
We love you Thalaiva @rajinikanth ❤️#Coolie 💪https://t.co/z9cVIUpTWL@anirudhofficial @anbariv @girishganges @philoedit @ArtSathees @sunpictures @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/aBA6DcW1mw
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 22, 2024