రజినీకాంత్, నయనతార లేకుండానే పెద్దన్న ప్రమోషన్స్..

Rajinikanth Peddanna | ఈ రోజుల్లో ఒక సినిమా ఎంత బాగా తీశామనేది మాత్రమే కాదు.. దాన్ని ఎంత వరకు ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాం.. ఎంత బాగా ప్రమోషన్ చేసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. అందుకే ఒక సినిమా విడుదలవుతుంది అంటే.. దానికి రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడతారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్లో అయితే సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచి దేశమంతా తిరుగుతారు హీరో హీరోయిన్లు. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఆ ప్రమోషన్ కనిపించడం లేదు. అయినా కూడా రాజమౌళి లాంటి దర్శకులు తమ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో రజనీకాంత్ పెద్దన్న సినిమా మాత్రం పెద్దగా ప్రమోషన్ లేకుండా విడుదల అవుతుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.

శివ దర్శకత్వంలో ఆయన నటించిన పెద్దన్న సినిమా నవంబర్ 4న దీపావళి సందర్భంగా విడుదల అవుతుంది. గత కొన్నేళ్లుగా సరైన విజయం లేని రజనీకాంత్ .. పెద్దన్న సినిమాపై భారీగానే నమ్మకం పెట్టుకున్నాడు. వరుస విజయాలతో తమిళనాట సంచలనం సృష్టిస్తున్న శివ.. సూపర్ స్టార్ తో పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే విషయం అర్థమవుతుంది. కచ్చితంగా పెద్దన్న రజనీకాంత్ కోరిక తీర్చేలా కనిపిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కించాడు శివ. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇందులో రజనీకాంత్ చెల్లెలుగా నటించింది. రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి తమిళంలో ఎలాంటి ప్రమోషన్ అవసరం లేదు. ఆయన బొమ్మ కనిపిస్తే థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడతారు. కానీ ఇప్పుడు తెలుగులో పరిస్థితులు అలా లేవు.

ఒకప్పుడు రజనీ సినిమా అంటే ఉండే అంచనాలు, ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన లింగ, కబాలి, కాలా, రోబో 2.0, పేట, దర్బార్ అత్యంత దారుణంగా నిరాశపరిచాయి. అందుకే పెద్దన్న సినిమాకు కేవలం 12 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం నయనతార , రజనీకాంత్ సహా ఎవరూ రాలేదు. కేవలం దర్శకుడు శివ, తెలుగు నిర్మాతలు, సీనియర్ హీరోయిన్ కుష్బూ మాత్రమే హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా నిన్న మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాడు రజినీకాంత్. అందుకే ఆయన ప్రమోషన్ కు రావడం లేదు. ఇక నయనతార తను నటించే ఏ సినిమా ప్రమోషన్‌కు రాదు. దాంతో స్టార్స్ లేకుండానే పెద్దన్న ప్రమోషన్ మొదలైంది. మరి దీపావళికి విడుదలయ్యే ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చిరంజీవి, రజినీకాంత్ సినిమాల మధ్య ఈ పోలికలు గమనించారా..?
SPB last song | రజినీకాంత్ కోసం ఎస్పీ బాలు పాడిన చివరి పాట వచ్చేసిందిగా..
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Keerthy Suresh: కీర్తి సురేష్ చెల్లెలిగా ఫిక్స్ అయిపోతుందా ఏంటి? అభిమానుల్లో టెన్షన్
నానితో మూడోసారి జోడీ కడుతున్న సమంత.. అలాంటి పాత్రలో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

