అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తారు. సాధారణంగా షూటింగ్‌కు ముందే మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి సినిమా కథ తాలూకు నేపథ్యం, కాన్సెప్ట్‌ను వివరిస్తారు. ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా చిత్రాలకు కూడా ఆయనే ఇదే పద్దతిని పాటించారు. కానీ ప్రస్తుతం మహేష్‌బాబుతో చేస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. భారతీయ పురాణాలతో ముడిపడిన సాహసగాథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
నవంబర్ ద్వితీయార్థంలో ఈ సినిమాకు సంబంధించి భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అక్కడే సినిమా గ్లింప్స్‌ను విడుదల చేస్తారు. గతంలో మాదిరిగానే ఈ గ్లింప్స్‌లోనే రాజమౌళి సినిమా తాలూకు కథానేపథ్యాన్ని తెలియజేస్తారని అంటున్నారు. దీంతో నవంబర్ ఈవెంట్ అందరిలో ఉత్సుకతను పెంచుతున్నది. యస్యస్ఎమ్బీ29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే వారణాసి, కెన్యా, హైదరాబాద్‌లలో కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.