Rajamouli: ఆ ప్రశ్నలు కాపీ కొట్టొద్దంటూ రాజమౌళి కౌంటర్

బాహుబలి సినిమాతో తెలుగోడి సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో మన ఖ్యాతి మరింత పెరిగేలా చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ ట్రైలర్ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయగా, దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక గత రెండు రోజులుగా పలు సిటీలలో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రోజు హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో అలియాభట్ని ఓ విలేకరి “ఆర్” అనే అక్షరానికి మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. సినిమా టైటిల్ లో కూడా “ఆర్ఆర్ఆర్” ఉంది. మరి సినిమాను, దాని టైటిల్ ను ఎలా ఎంజాయ్ చేశారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇదే ప్రశ్న బాలీవుడ్లో అలియాను ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఆ విధంగా స్పందించారు.
ఇక నాటు సాంగ్ పై వచ్చిన పలు రూమర్స్ పై రాజమౌళి ఒక సూపర్ క్లారిటీ ఇచ్చారు. అల్లూరి మరియు భీమ్ లు అలా ఎందుకు డాన్స్ చేశారు అనేది నేను జస్ట్ చిన్న బిట్ మాత్రమే చూపించాను కానీ అందులో ఇంకా చాలా ఉంది. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఆ సందర్భం అనేది ఎలా వచ్చింది అనేవి సినిమాలో తెలుస్తాయని విమర్శకులకి గట్టి క్లారిటీ ఇచ్చాడు. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు 10 భాషలలో విడుదల కానుందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

