Srikanth Bolla Biopic | హైదరాబాదీ అంధ విద్యార్థిపై బయోపిక్..లీడ్ రోల్లో బాలీవుడ్ యాక్టర్..!
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ టెక్నాలజీ (MIT) యూఎస్‌లో చదివిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి (first international blind student)గా ఎవరూ చెరపలేని రికార్డు సృష్టించాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ బొల్ల (Srikanth Bolla).
తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. పేదరికంలో ఉన్న వారికి కొడుకు పుట్టాడు. అయితే తమ కొడుకు అంధుడిగా పుట్టడంతో..ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే వారి కొడుకు మాత్రం తన పరిస్థితి పట్ల ఏం కుంగిపోకుండా..బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకొని..చదువులో ఎవరూ చేరుకోలేని స్థాయికి ఎదిగాడు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ టెక్నాలజీ (MIT) యూఎస్‌లో చదివిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి (first international blind student)గా ఎవరూ చెరపలేని రికార్డు సృష్టించాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ బొల్ల (Srikanth Bolla).
పదోతరగతి పూర్తయిన తర్వాత తనను సైన్స్ చదవనివ్వకపోవడంతో.. ప్రభుత్వంతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ శ్రీకాంత్ ఈ అరుదైన ఘనత సాధించడం ప్రపంచానికే స్పూర్తిదాయకం. శ్రీకాంత్ బొల్ల హైదరాబాదీ కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అకడమిక్స్‌లోనే కాదు..అంధుల క్రికెట్, అంతర్జాతీయ చెస్, బేస్ బాల్, స్విమ్మింగ్‌లో కూడా రాణిస్తున్నాడు శ్రీకాంత్ బొల్ల.
హైదరాబాద్‌కు చెందిన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంటర్ప్రెన్యూర్ గా నిలిచిన శ్రీకాంత్‌పై బయోపిక్ రాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ తుషార్ హిరానందనీ (Tushar Hiranandani) ఈ బయోపిక్ తెరకెక్కించనుండగా..బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు (Rajkummar Rao) ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించబోతున్నాడు.
దీనిపై శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ..నేను బయోపిక్‌పై మొదట ఆసక్తి చూపలేదు. నేనింకా చాలా దూరం వెళ్లాలని భావించాను. కానీ డైరెక్టర్ తుషార్ హీరానందాని పట్టుదలకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది. ముంబైలో రాజ్‌కుమార్‌రావును కలిశాను. నా పాత్రకు ఆయన న్యాయం చేయగలడనే నమ్మకం ఉందన్నాఉ.
Read Also : Chiru 154 | చిరంజీవి-బాబీ సినిమా షెడ్యూల్‌పై క్రేజీ అప్ డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

