‘రాజా ది రాజా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు రుత్విక్. అనిల్ బోయిడపు దర్శకత్వంలో బృందావన్ క్రియేషన్స్ పతాకంపై కె.నిహారిక దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో రుత్విక్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
మొదటి సినిమా రిలీజ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు తన కల నెరవేరబోతున్నదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉంది. అమెరికాలో ఫిల్మ్‌కోర్స్ చేశాను. కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ కూడా చేశా. ‘రాజా ది రాజా’లో నేను రెండు గెటప్స్‌లో కనిపిస్తా.
కమల్‌హాసన్, విక్రమ్ చేసిన విభిన్నమైన పాత్రలు నాకు చాలా ఇష్టం. వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాను. ఈ కథలో ఓ బలమైన పాయింట్ ఉంటుంది. అదేమిటో సినిమాలో చూడాల్సిందే. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలుంటాయి’ అన్నారు రుత్విక్. కొత్తవాళ్లమైనా అందరం పాషన్‌తో ఈ సినిమా చేశామని, సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులందరూ చిరునవ్వుతో బయటికొస్తారని, ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ చూసిన అనుభూతికిలోనవుతారని ఆయన చెప్పారు.