Raja Saab Teaser | రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చిత్రం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో వింటేజ్ ప్రభాస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు మారుతి చాలా బలంగా చెబుతున్నారు. ‘ది రాజా సాబ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే అభిమానుల్లో కూడా నమ్మకం బలపడింది. ది రాజా సాబ్ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్లో రూపొందుతోంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
దాదాపు చిత్ర షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుండగా, ఈ మూవీని డిసెంబర్ 5, 2025న విడుదల చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్ . ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కొద్ది సేపటి క్రితం టీజర్ విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ అంచనాలని రెట్టింపు చేసింది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పటి నుండి ఇండియా అంతా ‘రాజా సాబ్’ మ్యాడ్నెస్ చూస్తుంది. ప్రేక్షకులు అందరికీ ఒక విజువల్ ఫీస్ట్. టీజర్ మాత్రం చితక్కొట్టేసింది. ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానికి మంచి ప్రతిఫలం దక్కిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. ట్రైలర్లో చివరి షాట్, డైలాగ్ మాత్రం అందరికీ నచ్చేలా ఉంది.148 సెకన్ల నిడివి ఉన్న ఈ రాజా సాబ్ టీజర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్, వారితో ప్రభాస్ చేసిన సీన్లు, కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. ఇక సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజ మహల్ చుట్టూ జరిగే కథ, హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. వీఎఫ్ఎక్స్ కూడా బాగుంది.
ఈ టీజర్‌ను అధికారికంగా విడుదల చేయకముందే ఆన్లైన్లో లీక్ కావడం, మేకర్స్‌కు ఆందోళన కలిగించింది. లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేసే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను నిర్మించారట.. భారతీయ సినిమా చరిత్రలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరగనుందని అంటున్నారు.
MARUTHI MASS#TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/pC03Ihn3Ak
— 𝑺𝒖𝒋𝒊𝒕𝒉 𝒔𝒂𝒉𝒐𝒐 (@sujithsahoo) June 16, 2025