Break Out Movie | ఆసక్తిరేకెత్తిస్తున్న ‘బ్రేక్ అవుట్’ ట్రైలర్
Break Out Movie Trailer | ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా నిలదొక్కుకొవడగానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘పల్లకిలో పెళ్ళికూతురు’ సినిమాతో 2004లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయిన రాజాగౌతమ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ చిత్రం తర్వాత దాదాపు 10 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘బసంతి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం వచ్చిందన్న విషయం కూడా సగం మందికి తెలియదు. ఈ చిత్రం తర్వాత మరోసారి నాలుగేళ్ళ గ్యాప్ తీసుకుని ‘మను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం రాజాగౌతమ్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గానే మిగిలిపోయింది.
ఇక ఇప్పుడు ‘బ్రేక్ అవుట్’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. సుబ్బు చెరుకూరీ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. హీరోకు మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత ఉంటుంది. అనుకోని పరిస్థితిలో హీరో ఓ గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. ఈ ఫోబియా ఉన్న వారికి ఒంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా ఉంటుంది. అయితే, గ్యారేజ్‌లో ఒంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా, విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. కెమెరా విజువల్స్ థ్రిల్ ఫీల్‌ను కలగజేస్తున్నాయి.
సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఎంఎఫ్ బ్యానర్ పై అనీల్ మెడుగా నిర్మిస్తున్నాడు. జాన్స్ రుపెర్ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కిరీటి దామరాజు, చిత్ర శ్రీను, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

