Raj Tarun | కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరోకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్, ‘స్లీప్ వాకింగ్’ అనే కాన్సెప్ట్‌తో క్రియేట్ చేసిన ప్రచారం వైరల్‌గా మారింది. అసలు ఆ హీరో ఎవరు? ఏ సినిమాలో నటిస్తున్నాడు? అనే విషయంపై నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సస్పెన్స్‌కు మేకర్స్ తెరదించారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. రాజ్ తరుణ్ అని అధికారికంగా ప్రకటించారు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘టార్టాయిస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇది రాజ్ తరుణ్ కెరీర్లో ఇప్పటివరకు చూడని విభిన్నమైన పాత్రగా ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది.
‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోస్టర్లో ఓ డెడ్ బాడీ పక్కన రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే ఓ కత్తి ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఆ వ్యక్తిని ఎవరు చంపారు? రాజ్ తరుణ్ పాత్రకు ఆ హత్యతో సంబంధం ఏమిటి? అతను హంతకుడా? లేక ఏదైనా కేసులో ఇరుక్కున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడా? అనే ప్రశ్నలు పోస్టర్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి.‘టార్టాయిస్’ను సస్పెన్స్, డ్రామా, యాక్షన్ అంశాలను మేళవించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రిత్విక్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, పాత్రల విషయంలో కొత్తదనం ఉండేలా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రాజ్ తరుణ్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. ఆయన లుక్, పోస్టర్‌లోని వాతావరణం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌కు జోడీగా అమృత చౌదరి నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే నటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘టార్టాయిస్’ చిత్రాన్ని ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టైటిల్, ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్.. త్వరలోనే మరిన్ని కీలక అప్డేట్స్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.