Raj Tarun | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) పై అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నటి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతుండగా.. తాజాగా ఈ ఘటనపై రాజ్ తరుణ్ స్పందించాడు. రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తిరగబడర సామీ. మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటిస్తుంది. ఆగష్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా చిత్ర యూనిట్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో రాజ్ తరుణ్ – లావణ్య అంశంపై మీడియా అడుగగా.. రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రతిదానికి నా దగ్గర ఆధారం ఉంది. నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను లీగల్‌గానే వెళతాను న్యాయం జరిగే వరకు పోరాడుతా. లావణ్య ఇన్ని రోజులు నాపై ఆరోపణలు చేసింది. కానీ ఒక్కసారి అయిన ఆధారాలు చూపించిందా. లావణ్య చేస్తున్న ఆరోపణలకు సంభంధించి ఇప్పటివరకు ఎవరూ ఆధారాలు అడగలేదు. నేను లావణ్యతో గతంలో సహా జీవనంలో ఉన్నది వాస్తవం. లావణ్య అబార్షన్ అంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఒకవేళ నిజమే అయితే అందుకు సంబంధించిన మెడికల్ అధారాలు బయటపెట్టాలి కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆబార్షన్ గురించి లేదు అంటూ రాజ్ తరుణ్ తెలిపాడు.
ఇక మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి గతంలో రాజ్ తరుణ్ తనతో ఎన్నడూ మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. నా ఫ్యామిలీ కానీ, నేను కానీ ఆమెని ఎప్పుడూ కలవలేదు. మాపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియదు. ఆమె నాతో పాటు నా బ్రదర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చాను. ఈ నెల 24న కూడా లావణ్య నాకు మెసేజ్ చేసింది. అదీ కూడా పోలీసులకు ఫార్వర్డ్ చేశాను. లావణ్య గురించి ఇంతకు మించి ఏమీ మాట్లడలేను. లీగల్‌గా ఆమెపై చర్యలు తీసుకుంటాను అంటూ మాల్వీ చెప్పుకొచ్చింది.