టాలీవుడ్ (Tollywood) యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)నటిస్తోన్న తాజా చిత్రం అనుభవించు రాజా (Anubhavinchu Raja). విలేజ్ నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్కినేని నాగార్జున శనివారం లాంఛ్ చేశాడు. మా తదుపరి చిత్రం ఫస్ట్ లుక్ ను మీకు అందించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు నాగార్జున.
పోస్టర్ లో రాజ్ తరుణ్ తెలుపు రంగు డ్రెస్ లో చేతికి బంగారపు ఉంగరాలు, బ్రాస్ లెట్ పెట్టుకుని స్టైలిష్ గాగుల్స్ తో పందెం కోడివైపు చూస్తూ పందెం రాయుడిగా కనిపిస్తున్నాడు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో వివిధ రకాల కళాకారులు, కరెన్సీ నోట్లు, ఆలయాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కశిష్ ఖాన్ (Kashish Khan) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.
గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్. నరేశ్ బనెల్ సినిమాటోగ్రాఫర్. చోటా కే ప్రసాద్ ఎడిటర్. భాస్కర్ భట్ల పాటల రచయిత. కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్ తరుణ్ ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఎదురుచూస్తున్నాడు. రాజ్ తరుణ్ మరోవైపు స్టాండ్ అప్ రాహుల్ సినిమా కూడా చేస్తుండగా..చిత్రీకరణ దశలో ఉంది.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర