Rahul Ramakrishna | కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన తను తండ్రియినట్లు వెల్లడించాడు. తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియలో ప్రకటించాడు. ‘బాయ్.. సంక్రాంతి రిలీజ్’ అంటూ తన కొడుకు ఫోటోను షేర్ చేశాడు. దాంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ ఆ మధ్య ఒక షోలో తనకు త్వరలో పెళ్ళి కాబోతున్నట్లు తెలిపాడు. కానీ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు గాని, న్యూస్ గాని బయటకు రాలేదు. అయితే కొన్ని నెలల క్రీతం రాహుల్, తన భార్యను పరిచయం చేస్తూ ‘నా పిచ్చిని అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి’ అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌తో తనకు పెళ్లి అయినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక గతేడాది నవంబర్‌లో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించాడు.
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన రాహుల్ రామకృష్ణ, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నటుడిగానే కాకుండా డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశాడు. అయితే అర్జున్ రెడ్డితో రాహుల్‌కు మంచి క్రేజ్ వచ్చింది. శివ పాత్రలో జీవించేశాడు. ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది అనేంతలా ఇంపాక్ట్ చేశాడు. ఈ మూవీఓతో విజయ్‌కు ఎంత గుర్తింపు వచ్చిందో.. రాహుల్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. శివ పాత్రలో జీవించేశాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ప్రస్తుతం శివ నాలుగైదు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. గతేడాది ఆర్ఆర్ఆర్తో సహా ఐదారు సినిమాల్లో నటించాడు. నటునతో పాటు సింగర్‌గా, రైటర్‌గా, లిరిసిస్ట్‌గా పలు విభాగాల్లో సత్తా చాటుతున్నాడు.
Boy.
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023