Chandramukhi-2 Movie Shooting Wrapped | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే తెరకెక్కుతున్న సినిమా ‘చంద్రముఖి-2’. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. నిర్మాతలకు కాసులు వర్షం కురిపిచింది. ఇక దక్షిణాది ప్రేక్షకులకు సరికొత్త హర్రర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా హార్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కాగా దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది.
హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కంగానా రనౌత్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్కుమర్, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. నిజానికి చంద్రముఖి విజయం తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు p.వాసు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు.
And… Cut! Chandramukhi 2 shooting has officially packed up. 🎬 We can't contain our excitement for fans to experience it on the big screen. 🤩🕴🏻🔥 #Chandramukhi2 🗝️ #CM2 🗝️
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶 @mmkeeravaani
🎥 @RDRajasekar
🛠️ #ThottaTharani
✂️🎞️… pic.twitter.com/cqxHM8ZJ86— Lyca Productions (@LycaProductions) June 20, 2023