The Paradise | “హిట్ 3″తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). “దసరా” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకురుస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల రా స్టేట్మెంట్ అంటూ వీడియోను విడుదల చేయగా.. ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ మూవీలో విలన్‌కు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ప్యారడైజ్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కిల్ సినిమాలో రాఘవ్ జుయల్ నటన నచ్చడంతో శ్రీకాంత్ ప్యారడైజ్‌లో విలన్‌గా రాఘవ్‌ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘కిల్’, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ వంటి చిత్రాలతో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభంకాగా.. మొదటి షెడ్యూల్లో చిత్రంలోని ఇంట్రో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ‘ప్యారడైజ్’లో నాని సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.