తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఎఫ్ 3 ఒకటి. 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్. రీసెంట్గా ఎఫ్ 3 చిత్రం తిరిగి హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది.
తాజాగా సెట్లోకి సీనియర్ రాధికా శరత్ కుమార్ అడుగుపెట్టారు. వెంకటేష్, అనీల్ రావిపూడితో కలిసి కాసేపు సరదాగా గడిపాను. చాలా ఆనందంగా అనిపించింది అంటూ సెట్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. రాధికా పోస్ట్‌కు అనీల్ రావిపూడి కూడా స్పందిస్తూ.. మిమ్మల్ని కలవడం కూమా మాకు సంతోషంగా ఉంది. నవ్వులకు బ్రేకులు లేవు అని పేర్కొన్నారు.
మూడో భాగం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నట్టు సమాచారం. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసారు దర్శకుడు. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లే ఈ సినిమా కథ. ఇందులో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. సునీల్, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Never ending laughs! 😄
— Anil Ravipudi (@AnilRavipudi) September 21, 2021
A happy break with our @realradikaa garu. Nice to have you here! ✨🤗 https://t.co/SS3AbDeB0z