వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకుడు. గోనల్ వెంకటేష్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్‌లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రమిది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. ప్రేమ ప్రయాణంలోని అనుభూతులకు అద్దం పడుతుంది’ అన్నారు. మేక రామకృష్ణ, జయప్రకాష్, ప్రియ, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తాజ్ జీడీకే, సంగీతం: చైతు కొల్లి, కథ, మాటలు, పాటలు: వసంత్ వెంకట్ బాలా, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.