కోలీవుడ్ (Kollywood) భామ రాశీఖన్నా (Raashii Khanna) సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ భామ ప్రస్తుతం తన అప్ కమింగ్ తెలుగు సినిమా థాంక్యూ (Thank You) షూటింగ్ లో బిజీగా ఉంది. నాగచైతన్య, రాశీఖన్నా అండ్ టీంపై మాస్కోలో చిత్రీకరణ కొనసాగుతుంది. ప్రతీ ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక కల ఉన్నట్టుగానే..రాశీఖన్నాకు కూడా ఉంది. ఆ కల ఇవాళ్టికి నెరవేరింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా షేర్ చేసుకుంది రాశీఖన్నా.
ఇంతకీ ఆ డ్రీమ్ ఏంటనే కదా మీ డౌటు. మాస్కో (Moscow)లోని మంచుతో కప్పబడ్డ ప్రాంతంలో మంచు గడ్డలను గాల్లోకి ఎగరేస్తూ చిన్నపిల్లలా సరదాగా ఆటలాడింది రాశీఖన్నా. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన స్లో మోషన్ వీడియోలో రాశీఖన్నా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి ఆమె కోస్టార్లు అనుపమ పరమేశ్వరన్, విద్యు రామన్ తోపాటు పలువురు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ పాల బుగ్గల సుందరి మంచులో సరదాగా చిల్ అవుట్ అవుతున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మొత్తానికి రాశీఖన్నా ఇలా మంచుతో ఆడలాడాలనే తన చిన్ననాటి డ్రీమ్ నెరవేరడం పట్ల చాలా హ్యాపీగా ఫీలవుతుంది.